ఉలగనాయగన్ కమల్ హాసన్ మరియు సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య జరిగిన చిరస్మరణీయ సంఘర్షణను సినీ ప్రపంచం 2005లో చూసింది. తాజాగా ఇప్పుడు, 18 ఏళ్ల విరామం తర్వాత ఈ దిగ్గజ నటీనటులు మల్లి బాక్స్ఆఫీస్ వద్ద డి కొట్టటానికి సిద్ధంగా ఉన్నారు. కమల్ హాసన్ యొక్క ఆళవంధన్ (తెలుగులో అభయ్) మరియు రజనీకాంత్ ముత్తు డిసెంబర్ 8, 2023న గ్రాండ్ రీ-రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నట్లు సమచారం.
సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఆళవంధన్ బాక్సాఫీస్ సవాళ్లను ఎదుర్కొంది కానీ కమల్ హాసన్ యొక్క అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో రీ-రిలీజ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే, కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ముత్తు సినిమా కోలీవుడ్‌లో మెగా బ్లాక్‌బస్టర్‌గా మిగిలిపోయింది.