గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా విభిన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’పై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఇటీవల సలార్‌పై వచ్చిన రూమర్స్‌పై దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పందించారు. కేజీయఫ్, సలార్ ఒకే యూనివర్స్‌లో తెరకెక్కాయనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ‘సలార్‌కు, కేజీఎఫ్‌కు అసలు సంబంధం లేదు. రెండింటికీ కనెక్షన్ ఉందనుకున్న వారిని నిరుత్సాహపరిచినందుకు క్షమాపణలు’ అని నీల్ తెలిపారు.