సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌పై హీరో విశాల్ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సీబీఎఫ్సీ ముంబై శాఖ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా తాజాగా విశాల్ సీబీఐ ఎదుట హాజరయ్యారు. ‘నాకు ఇది పూర్తిగా కొత్త అనుభవం. నేను జీవితంలో సీబీఐ ఆఫీసుకు వెళ్తానని అసలు అనుకోలేదు. రీల్ లైఫ్‌లోనే కాదు. రియల్ లైఫ్‌లోనూ అవినీతిపై పోరాడాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నాడు.