USA మరియు UKలో అడ్వాంస్ బుకింగ్‌లు ప్రేక్షకులలో సాలార్‌కు ఎలాంటి హైప్ ఉందో సూచిస్తున్నాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, ఇందులో ప్రభాస్ సరసన జోడిగా శృతి హస్సన్ నటిస్తుంది. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు కేజీఎఫ్‌కి, సాలార్‌కు సంబంధం ఉందా లేదా అన్నది సినీ అభిమానుల్లో మిలియన్ డాలర్ల ప్రశ్న.
తాజాగా ఒక బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ ఈ ప్రశ్నకి సమాధానమిచ్చాడు. సాలార్ వరల్డ్ కేజీఎఫ్ కంటే పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. రెండు సినిమాలూ విభిన్నమైన కథలు, ఎమోషన్స్‌తో కూడుకున్నవని తెలిపారు. సాలార్ మరియు కెజిఎఫ్లలో కూడా కథ చెప్పే ఫార్మాట్ భిన్నంగా ఉంటుందని ప్రశాంత్ నీల్ పేర్కొన్నాడు.
సాలార్ మరో కేజీఎఫ్ అవుతుందని ప్రజలు ఆశించవద్దని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు. కాబట్టి దీనితో KGF మరియు సాలార్ మధ్య ఎటువంటి సంబంధం ఉండదని స్పష్టమవుతుంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 22, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.