సల్మాన్ ఖాన్ టైగర్ మరియు షారుఖ్ ఖాన్ పఠాన్ ఈ భారీ సినిమాని యష్ రాజ్ ఫిలింస్ నిర్మించాయి. తాజాగా ఇప్పుడు, యష్ రాజ్ ఫిలిమ్స్ త్వరలో సల్మాన్ మరియు SRK లతో టైగర్ vs పఠాన్ చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం 2024 మధ్యలో రావలిసి ఉండగా తాజా సమాచారం ప్రకారం సినిమా వాయిదా పడింది.
టైగర్ 3కి వచ్చిన మిశ్రమ స్పందన చూసి నిర్మాత ఆదిత్య చోప్రా సినిమా స్క్రిప్ట్‌పై రీవర్క్ చేయమని తన బృందాన్ని కోరినట్లు ముంబై ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ టాక్. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి. షారుఖ్ ఖాన్ తదుపరి డిసెంబర్ 21, 2023న విడుదల కానున్న డుంకీలో కనిపించనున్నారు మరియు సల్మాన్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రారంభించలేదు.