గత కొన్ని రోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ 63వ సినిమాపై సోషల్ మీడియాలో చాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ లేదా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తారని రూమర్స్ వస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ప్రొడక్షన్ హౌస్ తమిళ స్టార్ హీరోకి 150 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు అజిత్ తన సినిమాలకు దాదాపు 100 కోట్లు అందుకున్నాడు. అజిత్ తన ప్రస్తుత చిత్రం విడా ముయార్చిని పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నాడు.