ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హాయ్ నాన్న' కోసం శ్రుతిహాసన్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 03, 2023, 08:00 PM

నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని తన 30వ చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి హాయ్ నాన్నా అనే టైటిల్‌ను మూవీ మేకర్స్ ఖరారు చేసారు. ఇటీవల మూవీ మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రంలో శృతిహాసన్ అతిధి పాత్రలో కనిపించనుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, శ్రుతిహాసన్ కేవలం కొన్ని సన్నివేశాలు మరియు పాటల కోసం ఏకంగా 90 లక్షలు వసూలు చేసిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ పాన్-ఇండియన్ చిత్రంలో బేబీ కియారా, జయరామ్, ప్రియదర్శి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 7, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానికి జోడిగా నటిస్తుంది. ప్రముఖ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి KS ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com