KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో సాలార్ ఒకటి. డిసెంబరు 23న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ని మూవీ మేకర్స్ కొద్ది రోజుల క్రితం విడుదల చేసింది. ట్రైలర్‌పై చాలా మంది సంతోషంగా లేకపోవడంతో రెండవ ట్రైలర్‌ను మేకర్స్ రెడీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నెల 16న ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ కొత్త ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్లు లేటెస్ట్ టాక్.
ట్రైలర్లో ప్రభాస్ ఎంట్రీ కాస్త ఆలస్యంగా రావడం చాలామందిని నిరాశపరిచింది. అభిమానులను ఆకట్టుకునేందుకు సినిమాలను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేందుకు సరికొత్త పవర్ఫుల్ ట్రైలర్‌ను సిద్ధం చేస్తున్నట్లు గాసిప్ వినిపిస్తోంది. ఈ వార్త ఇంకా ధృవీకరించబడనప్పటికీ ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాలార్ రెండు భాగాలుగా విడుదల కానుంది.