81 ఏళ్ల దిగ్గజ దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ తన ఇటీవలి క్రైమ్ డ్రామా 'కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్' అక్టోబర్ 2023లో విడుదల అయ్యి అందరి దృష్టిని ఆకర్షించింది. లియోనార్డో డికాప్రియో, రాబర్ట్ డి నీరో మరియు లిల్లీ గ్లాడ్‌స్టోన్ ఈ సినిమాలో కీలక పత్రాలు పోషించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన 3-గంటల 26-నిమిషాల సినిమా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ రంగప్రవేశం చేసింది.
భారతీయ ప్రేక్షకులు ఈ సినిమా ని రెంటల్ బేస్ పై ప్రసారం చేయవచ్చని బుక్ మై షో స్ట్రీమ్ అధికారికంగా ప్రకటించింది. అదనంగా, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యాపిల్ టీవీలలో కూడా రెంటల్ బేస్ పై ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.