సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆస్ట్రేలియా బాక్స్ఆఫీస్ వద్ద 96 లొకేషన్స్ నుండి A$467,775 వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది.
అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ, చారు శంకర్, బబ్లూ పృథ్వీరాజ్ మరియు శక్తి కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ మరియు మురాద్ ఖేతాని నిర్మించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.