ఫస్ట్ టైమ్ నయనతార హీరోయిన్గా కాకుండా కాస్త పెద్దరికం ఉన్న పాత్రలో నటించబోతోంది. తన భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఇప్పటికే నటించిన హీరోయిన్ నయనతార.. ఇప్పుడు మరోసారి ఆయన దర్శకత్వంలో నటించబోతోంది. అయితే, ఇప్పటి వరకు హీరోయిన్గా ఓ స్టార్డమ్ సొంతం చేసుకున్న నయనతార.. ఇప్పుడు అక్క పాత్రలో కనిపించనుంది. ‘లవ్ టుడే’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న యంగ్ దర్శకుడు, ప్రదీప్ రంగనాధన్ ను కథానాయకుడిగా విగ్నేష్ శివన్ ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోయిన్గా బాలీవుడ్ నటిని ఎంపిక చేశారు. సెవెన్ స్క్రీన్స్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితం కానుంది. ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ షార్ట్ గా ‘‘ఎల్ఐసీ’’ (LIC) అనే టైటిల్‌ను ఖరారు చేయగా, ఇందులో సీనియర్ దర్శక నటుడు ఎస్ జే సూర్య, యోగిబాబు కీలక పాత్రలను పోషించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇందులో నయనతార ప్రదీప్ రంగనాథన్‌కు అక్కగా నటించేందుకు సమ్మతించినట్లు వినికిడి. తన భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘నానుమ్ రౌడీదాన్’, ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ అనే చిత్రాల్లో నయనతార నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రంలో ఆమె నటించనుంది. ఈ సినిమాలో నయనతార అక్కగా చేస్తుందని తెలియగానే సినిమాపై భారీగా అంచనాలు నమోదవుతున్నాయి.