భారీ వర్షాల కారణంగా చెన్నై నగరం అతలాకుతలమైంది. ఇలాంటి సమయంలో ఓ నటి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. తమిళన నటి శివానీ నారాయణ్ వర్షపు నీటిలో చిందులు వేస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దానికి చెన్నై రెయిన్స్ అని క్యాప్షన్ కూడా పెట్టారు. దాంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. వర్షాల కారణంగా ప్రజలు తిండి లేక అవస్థలు పడుతుంటే.. ఇలాంటి పోస్ట్ పెట్టడం ఏంటని హెచ్చరిస్తున్నారు