పవన్ కల్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్క సంగతి తెలిసిందే! ఈ చిత్రం ప్రకటించి చాలాకాలం అయినా ఇప్పటి దాకా ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం పవన్ చేతిలో 'హరిహర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగతసింగ్' చిత్రాలున్నాయి. ఆయన రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఈ చిత్రాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. తాజాగా సురేందర్‌రెడ్డి చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఆ సినిమా రచయిత వక్కంతం వంశీ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఆ చిత్రం సోషల్ సెటైర్‌గా తెరకెక్కనుందని తాజా ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. స్టోరీ నచ్చడంతో.. ఎప్పుడెప్పుడు షూటింగ్‌కు వెళ్దమా అనే ఆసక్తిని పవనకల్యాణ్ కనబరిచారని వంశీ చెప్పారు. అయితే పవనకల్యాణ్ నటిస్తున్న మూడు చిత్రాలు సెట్స్ మీదున్నాయి. రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ప్రస్తుతం షూటింగ్ పోస్ట్పోనలో ఉన్నాయి. ఆ చిత్రాలు పూర్తయితే కానీ సురేందర్‌రెడ్డి సినిమాకు క్లియరెన్స రాదు. అదెప్పుడో చూడాలి మరి. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఎక్స్ట్రా: ఆర్డినరీ మ్యాన్’ ప్రమోషన్సలో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పవర్ - సురేందర్‌రెడ్డి కాంబోలో రాబోతున్న సినిమా గురించి పంచుకున్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రమిది. ఈ సినిమాలో నితిన్.. జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తారు. రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.