బిగ్ బాస్ 7 తెలుగు ముగింపు దశకు చేరుకుంది. వచ్చే వారం ఈ షో గ్రాండ్ ఫినాలే జరగనుంది. తాజాగా ఇప్పుడు శివాజీ తనకు ప్రియాంక, శోభాశెట్టి లాంటి కూతుళ్లు ఉంటే వారిని అణచివేస్తానని కొడతానని శివాజీ కొద్దిరోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
ఈ టాపిక్ ని తీసుకోని నాగార్జున వీకెండ్ షోలో శివాజీని మందలించాడు. కానీ శివాజీ కూడా వెనుదిరగకుండా నాగ్‌తో ఈ విషయంపై భయం లేకుండా మాట్లాడాడు. ఇది జరిగినప్పటి నుంచి సామాన్య ప్రేక్షకులు శివాజీకి మద్దతుగా నిలిచారు. శివాజీ స్థానంలో ఎవరికైనా కోపం వచ్చి అలా స్పందిస్తారని సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యలు చేస్తున్నారు.