యానిమల్ విజయంతో దేశంలో త్రిప్తి డిమ్రీ ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారింది. ఈ ఖలా నటి సినిమాలో ఆమె లుక్స్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఆమెకు చాలా మంది అభిమానులను సంపాదించిపెట్టాయి. తాజాగా ఇప్పుడు ఈ నటి సినిమాలో తన బోల్డ్ సన్నివేశాలను చూసిన తర్వాత తన తల్లిదండ్రులు ఎలా భావించారో వెల్లడించింది.
ఒక ఇంటర్వ్యూలో గ్లామర్ బ్యూటీ మాట్లాడుతూ.... యానిమల్ సినిమా చూసి తన తల్లిదండ్రులు అవాక్కయ్యారని, ఇప్పటి వరకు సినిమాల్లో ఇంత బోల్డ్ సీన్ ఎవరూ చేయలేదని నువ్వే చేశావని తనతో చెప్పుకొచ్చారు. త్రిప్తి తల్లిదండ్రులు ఆమె ఏ తప్పు చేయలేదని తన తల్లిదండ్రులకు చెప్పినట్లు వెల్లడించారు. నేను యాక్టర్ ని నేను పోషించే పాత్రతో నేను 100 శాతం నిజాయితీగా ఉండాలి మరియు నేను అలా చేసాను అని త్రిప్తి తన తల్లిదండ్రులతో చెప్పినట్లు పేర్కొంది.