గుండెపోటుకు గురైన ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రేయాస్ ప్రాణాలతో బయటపడ్డాడు. ‘‘ప్రస్తుతం నా భర్త ఆరోగ్యం నిలకడగా ఉంది.. క్రమంగా కోలుకుంటున్నాడు.. మరికొద్ది రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. శ్రేయాస్ ఆరోగ్యాన్ని వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. ఈ క్లిష్ట సమయంలో మేము ఉన్నాం" అని అతని భార్య దీప్తి శ్రేయస్ ఒక ప్రకటనలో తెలిపారు.