టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకతంలో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రానికి చిత్ర నిర్మాతలు 'దే కాల్ హిమ్ OG' అనే టైటిల్ ని ఖరారు చేసారు. తాజాగా విడుదలైన టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
బిగ్ బాస్ 7 తెలుగు కంటెస్టెంట్ శుభశ్రీ సోషల్ మీడియాలో 'మనోభవాలు' అనే పదంతో సుపరిచితమైంది. తాజాగా ఇప్పుడు ఈ బ్యూటీ పవర్‌స్టార్ యొక్క అత్యంత ఎదురుచూసిన చిత్రం OGలో కీలక పాత్ర చేసే గోల్డెన్ ఛాన్స్‌ను పొందింది. పవర్‌స్టార్ సినిమాలో తాను చేస్తున్నట్లు స్వయంగా శుభశ్రీ పంచుకున్నారు. తాను ఓజీలో ఓ పాత్ర చేయబోతున్నానని ఆ పాత్ర చాలా అందంగా ఉంటుందని పేర్కొంది.
ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, అమితాబ్ బచ్చన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ బిగ్గీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa