నటులు త్రిష, మెగాస్టార్, ఖుష్బూపై నటుడు మన్సూర్ అలీఖాన్ వేసిన పరువునష్టం దావా పిటిషన్ను రూ.లక్ష జరిమానాతో మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. అతడి పిటిషన్ను పరువునష్టంగా పరిగణించలేమని పేర్కొంది. కాగా, నటి త్రిషపై మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు సెలబ్రిటీలు త్రిషకు అండగా నిలిచారు. దాంతో అతడి పేరుకు కలంకం తెచ్చారంటూ మన్సూర్ ఆరోపించారు. త్రిష, ఖుష్బూ, చిరంజీవిలపై పరువు నష్టం దావా దాఖలు చేశారు.