ఈరోజు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో 2024 సంక్రాంతి రిలీజ్ల నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు హాజరయ్యారు. మహేష్ బాబు గుంటూరు కారం నిర్మాత నాగ వంశీ, ఈగల్ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్, నా సామి రంగ నిర్మాత శ్రీనివాస్ చుట్టూరి ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. కానీ ఫాంటసీ యాక్షన్ డ్రామా హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి సమావేశానికి రాలేదు.
సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడానికి నిర్మాతలు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. పండగకు తమ సినిమాలను విడుదల చేయాలనే విషయంలో నిర్మాతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. విడుదల తేదీని ముందుగా ప్రకటించేది తామేనని ప్రతి నిర్మాత చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై వచ్చే వారంలో నిర్ణయం తీసుకుంటామని దిల్ రాజు చెప్పారు. ఇప్పుడు ఏమి జరుగుతుందో చూడాలి.