పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సాలార్ సినిమా నైజాం రీజియన్‌లో ఆల్ టైమ్ రెండవ అతిపెద్ద ఓపెనింగ్‌ని సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా ఈ ప్రాంతంలో మొదటి రోజునే 22.55 కోట్ల (GSTతో కలిపి) షేర్‌ను సాధించింది. తెలంగాణలో సాలార్ మొదటి రోజు కలెక్షన్లు భారీ మల్టీస్టారర్ RRR తర్వాత మాత్రమే ఉన్నాయి. నైజాంలో ప్రభాస్‌కు ఫుల్ క్రేజ్ ఉంది. మరోసారి, నటుడు తన స్టార్ పవర్‌ను మొదటి రోజు మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ తో ప్రదర్శించాడు.
ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యమైన పాత్రలో నటించారు. ప్రభాస్ యాక్షన్ అవతార్‌ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మాకో స్టార్‌ని ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్లో చూడటం ఆనందంగా ఉందని అది అతని ఇమేజ్‌కి సరిగ్గా సరిపోతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ ఈ భారీ సినిమాని నిర్మించింది.