పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాలార్: పార్ట్ 1 డిసెంబర్ 22, 2023న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఇప్పుడు సాలార్ సినిమా అధికారికంగా 2023లో అతిపెద్ద భారతీయ ఓపెనర్ గా నిలిచింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సాలార్ ప్రపంచ స్థాయిలో మొదటి రోజు 178.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్‌కి ఇది రెండవ అతిపెద్ద ఓపెనర్ సినిమా. ప్రభాస్ స్టార్ పవర్ మరియు ప్రేక్షకులలో ప్రశాంత్ నీల్ యొక్క క్రేజ్ సినిమా ఈ అద్భుతమైన ఫీట్ సాధించడంలో సహాయపడింది. నీల్ యొక్క మునుపటి చిత్రం KGF 2, బాక్స్ ఆఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది మరియు సాలార్ యొక్క టాక్ పాజిటివ్ గా ఉంది కాబట్టి సాలార్ సినిమా KGF 2 రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.