బిగ్ బాస్ 7 తెలుగు విజేతగా పల్లవి ప్రశాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. షో ముగిసిన తర్వాత ర్యాలీలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందున విజేత పల్లవి ప్రశాంత్‌ను 14 రోజుల పాటు జైలుకు పంపించారు. షో గెలిచిన ఒక్కరోజుకే జైలుకు వెళ్లడంతో ప్రశాంత్‌పై సానుభూతి వ్యక్తమవుతోంది. పోలీసులు చాలా కఠినంగా ప్రవర్తించారని అతను సామాన్యుడు కావడంతో ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడిని అరెస్ట్ చేశారని ఒక వర్గం వెల్లడిస్తుంది.
అయితే ప్రశాంత్‌ను అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు వెళ్లమని పోలీసులు అభ్యర్థించినప్పటికీ అతను వారి మాట వినకుండా తన ర్యాలీని కొనసాగించాడని సమాచారం. పోలీసులు అతడిని అభ్యర్థిస్తున్న క్లిప్‌లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.