మరో రెండు రోజుల్లో విడుదల కానున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా, 10 నిమిషాల వ్యవధిలో ఓ మల్టీ ప్లెక్స్ లో 1000 టికెట్లు అమ్ముడు కావడాన్ని ప్రస్తావిస్తూ, ఓ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.
"ఓపెనింగ్స్ స్పీడ్ చూస్తుంటే కథానాయకుడు, మహానాయకుడు కన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని చూడడానికే ప్రజలు ఎగబడుతున్నారు, అంటే నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. జై బాలయ్య" అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో హౌస్ ఫుల్ అయినట్టు చూపుతున్న థియేటర్ సీటింగ్ స్క్రీన్ షాట్ ను కూడా యాడ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa