కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'భీమా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో గోపీచంద్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. మూవీ మేకర్స్ ఇటీవల కాకినాడలో మేజర్ షెడ్యూల్‌ను ముగించారు.
తాజాగా ఇప్పుడు, కర్ణాటకలోని మంగళూరులో యాక్షన్-ప్యాక్డ్ షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ మరియు కీలకమైన సన్నివేశాలని షూట్ చేయనున్నారు. ఈ కొత్త షెడ్యూల్లో గోపీచంద్ మరియు భీమాలో కీలక పాత్రలు పోషిస్తున్న ఇతర నటీనటులు పాల్గొంటున్నారు.
ఈ చిత్రంలో యువ తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ మాస్ ఎంటర్టైనర్ను నిర్మించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.