నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్‌ను 93 రోజుల్లో అంటే మార్చి 31 లేదా ఏప్రిల్ 1, 2024 విడుదల కానుంది.
ఆసియాలో అతిపెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్ యొక్క 27వ ఎడిషన్ టెక్ఫెస్ట్ 2023-2024 ప్రస్తుతం IIT బాంబేలో జరుగగా ఈ ఈవెంట్ కి నాగ్ అశ్విన్ వెళ్లారు. టెక్‌ఫెస్ట్ సందర్భంగా మాట్లాడుతూ కల్కి 2898 AD దర్శకుడు నాగ్ అశ్విన్ తన సినిమా మరియు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల మధ్య పోలికల గురించి ఓపెన్ అయ్యారు.
కల్కి 2898 AD భారతీయ చలనచిత్రంలో రూపొందించబడిన మొదటి నిజమైన సైన్స్ ఫిక్షన్ చిత్రం అని నాగ్ అశ్విన్ వెల్లడించారు. కల్కి డిఫరెంట్ సినిమా. కథ పూర్తిగా కొత్తగా ఉంటుంది. కల్కి 2898 ADలో భవిష్యత్తులో భారతీయ నగరాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులు చూస్తారు అని వెల్లడించారు.
ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.