సాధారణంగా శుక్రవారం రోజునే సినిమాలు ఎక్కువగా విడుదల అవుతాయి. పండగలు, ప్రత్యేక రోజులు మినహాయిస్తే దర్శక, నిర్మాతలు సైతం సినిమాలను శుక్రవారమే విడుదల చేయాలనుకుంటారు. అయితే, ఈ సాంప్రదాయానికి ప్రధాన కారణం శుక్రవారాన్ని లక్ష్మీదేవి రోజుగా భావిస్తారు. ఆ రోజున సినిమా విడుదల చేస్తే మంచి లాభాలు వస్తాయని, అలాగే శుక్రవారం చాలామంది వీకెండ్ మూడ్లో ఉంటారు. కాబట్టి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.