కన్నడ హీరోయిన్ అదితి ప్రభుదేవా తన అభిమానులకు శుభవార్త తెలిపారు. తాను అమ్మను కాబోతున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. కొత్త సంవత్సరంలో తల్లి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ మేరకు బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. కాగా, నటి అదితి ప్రభుదేవా ప్రముఖ వ్యాపారవేత్త యషాస్ను 2022లో పెళ్లి చేసుకున్నారు.