2023లో చాలా మంది సినీ తారలు పెళ్లి పీటలెక్కారు. కొత్త ఏడాదిలోనూ ఆ జాబితా మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పలువురు హీరోయిన్లు ఈ ఏడాది పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, అదితి రావు హైదరీ తదితరులు ఇప్పటికే ప్రేమలో ఉన్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్. వీళ్లతో పాటు శృతి హాసన్, సంయుక్త మేనన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.