ప్రముఖ నిర్మాత ఇంట నూతన సంవత్సరం విషాదాన్ని నింపింది. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, బేబీ సినిమా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి గాదె సూర్య ప్రకాశరావు ఇవాళ ఉదయం మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. పలువురు సినీ ప్రముఖులు ఎస్కేఎన్ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం ప్రకటిస్తున్నారు.