ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT పార్టనర్ ని లాక్ చేసిన 'భీమా'

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 05, 2024, 06:50 PM

కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'భీమా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16, 2024న విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో గోపీచంద్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో యువ తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com