స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా నెట్టింట అందాల దుమారం రేపుతోంది. తన లేటెస్ట్ లుక్ తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాగాజా పంచుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ లో ఈ ముద్దుగుమ్మకు ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. దాంతో ఇన్నాళ్లు కెరీర్ ను కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ లోనూ సందడి చేస్తోంది. అక్కడే వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటోంది. ఊహించని విధంగా వెండితెరపై మెరుస్తూ సెన్సేషన్ గా మారింది. కెరీర్ ను సెకండ్ ఇన్నింగ్స్ లో కొనసాగిస్తున్న మిల్కీ బ్యూటీ బోల్డ్ గా మెరుస్తూ మైమరిపిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ స్టన్నింగ్ లుక్ లో దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా తమన్నా పంచుకున్న ఫొటోలు టూ హాట్ గా ఉన్నాయి. బిగుతైన అవుట్ ఫిట్ లో స్టార్ హీరోయిన్ అందాల ప్రదర్శనకు నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు. పిక్స్ మరింతగా వైరల్ చేస్తున్నారు. రీసెంట్ గా ముంబైలో జరిగిన యానిమల్ సక్సెస్ పార్టీలో తమన్నా ఇలా దర్శనమిచ్చింది. తన లేటెస్ట్ లుక్ తో అందరినీ కట్టిపడేసింది. ప్రస్తుతం ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక తమన్నా చివరిగా ‘భోళా శంకర్’తో అలరించింది. అటు ‘బాంద్రా’తోనూ వచ్చింది. ఇక ‘అరణ్మనై4’, ‘వేదా’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటు సోషల్ మీడియాలోనూ తళుక్కుమంటూ మతులు పోగొడుతోంది.