టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు చిత్ర పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. 'జాతి రత్నాలు' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ కెవి రవితేజకు కామెడీ స్క్రిప్ట్‌ను వినిపించినట్లు సమాచారం. కథ విన్న వెంటనే స్టార్ నటుడు వెంటనే స్క్రిప్ట్ కి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రద్ధ శ్రీనాధ్ జోడిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.