విజయ్ బిన్ని దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'నా సామి రంగా' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ గ్రామీణ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా జనవరి 14, 2024న విడుదల కానుంది. రేపు మధ్యాహ్నం 03:15 గంటలకు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
నా సామి రంగ చిత్రంలో ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అకాడమీ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.