ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2024, 11:23 AM

సెలబ్రిటీలు బయట ఎలా ఉంటారో అందరికి తెలుసు. వాళ్ళు బయటకు వస్తున్నారు అంటే.. ఓ రేంజ్ లో రెడీ అవుతారు. బ్రాండ్స్, డిజైనర్ డ్రెస్ లు..జిగేల్ జిగేల్ అనిపించే యాక్సరీసీస్ తో కనిపిస్తారు. కానీ, సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. ఒక్క సినిమాలో తప్ప.. ఏరోజు మహేష్ బయట ఆడంబరంగా కనిపించింది లేదు. ఫంక్షన్స్ కు వెళ్లినా.. పెద్ద పెద్ద ఈవెంట్స్ కు వెళ్లినా ఒక టీ షర్ట్ వేసుకొని వచ్చేస్తాడు. కనీసం గాగుల్స్ కూడా పెట్టుకొని కనిపించడు.


అసలు మహేష్ ఈవెంట్ అంటే నిద్రపోయి.. డైరెక్ట్ గా బెడ్ మీద నుంచి లేచి హ్యాంగర్ కు ఉన్న షర్ట్ వేసుకొని వచ్చేస్తాడా అనే అనుమానం కూడా వస్తుంది. అలా ఉంటుంది మహేష్ అవుట్ ఫిట్. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. బాబు.. చెక్ షర్ట్స్.. డెడ్లీ కాంబో అని చెప్పాలి. ఎంతో సింపుల్ గా ఉండే చెక్ షర్ట్స్ నే మహేష్ ఎక్కువగా వాడుతూ ఉంటాడు. గత కొన్నేళ్లుగా మహేష్ బయట ఎక్కడ కనిపించినా చెక్ షర్ట్స్ తోనే కనిపిస్తున్నాడు. తాజాగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మహేష్ చాలా సింప్లిసిటీగా కనిపించాడు. ఒక స్టార్ హీరో.. ఇలా సాదాసీదాగా కనిపించడం అనేది చాలా రేర్. ఒక నార్మల్ చెక్ షర్ట్ తో వచ్చాడు మహేష్. ఇక ఈ సింప్లిసిటీకే బాబు పడిపోయాం అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com