టాలీవుడ్ హీరో నితిన్ కు ‘తమ్ముడు’ షూటింగ్ లో ప్రమాదం జరిగి గాయపడ్డారని వస్తున్న వార్తలపై మూవీ యూనిట్ స్పందించింది. షూటింగ్ లో ఎలాంటి ప్రమాదం జరగలేదని క్లారిటీ ఇచ్చింది. హీరో నితిన్ భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నాడని, అందుకే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చామని తెలిపింది. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుగుతుండగా బ్రేక్ ఇచ్చారు.