నెట్టింట మెగా కోడళ్ల లవ్లీ పోస్టులు వైరల్గా మారాయి. మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠిని ఉద్దేశిస్తూ..‘‘కొత్తకోడలు ఇంటిల్లిపాదికి సున్నుండలు చేస్తోంది. ఆమె ఎంతో స్వీట్’’ అని ఉపాసన వీడియో పోస్ట్ చేశారు. దీనిపై లావణ్య స్పందిస్తూ.‘‘థ్యాంక్యూ.. సూపర్ స్వీట్ పెద్దకోడలు’’అని రిప్లై ఇచ్చారు. ఈ ఇద్దరు మెగా కోడళ్ల స్వీట్ పోస్టును చూసి నెటిజన్లు వెరీ లవ్లీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.