దర్శకుడు పా రంజిత్‌తో స్టార్ హీరో విక్రమ్ తంగలన్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాపై ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నిర్మాతలు విడుదల తేదీని పేర్కొనకుండా ఏప్రిల్ 2024కి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించారు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.