మారుతీ దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'భలే ఉన్నాడే' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
గీతా సుబ్రమణ్యం, పెళ్లి గోల 2, యు అండ్ ఐ హలో వరల్డ్ వంటి అనేక విజయవంతమైన వెబ్ షోలను అందించిన నూతన దర్శకుడు జె శివసాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మనీషా కంద్కూర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్, అమ్ము అభిరామి, లీలా శాంసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ సినిమాని రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.1గా ఎన్.వి.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పిస్తుంది.