అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఈ నెల 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ మందిరం ప్రారంభోత్సవాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. వారందరికీ అన్నదానం చేయనున్నట్లు ప్రభాస్ ప్రకటించారు. దాదాపు 300 ప్రదేశాల్లో అన్నదానం చేయనున్నారు. దీని కోసం రూ.50 కోట్లు ఖర్చు అవుతోంది.