బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ భార్య, సీనియర్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా 50 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా పొందారు. లండన్ విశ్వవిద్యాలయం (గోల్డ్ స్మిత్స్) నుంచి ఫిక్షన్ రైటింగ్‌లో మాస్టర్ డిగ్రీ అందుకున్నారు. దీనిపై అక్షయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఇల్లు, కెరీర్‌ను చూసుకుంటూనే విద్యను అభ్యసించావని, సూపర్ ఉమెన్‌ని పెళ్లి చేసుకున్నానని అక్షయ్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు పట్టా అందుకున్న అనంతరం ఆమెతో దిగిన ఫోటోను నెట్టింట షేర్ చేశారు.