కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ తన 62వ ప్రాజెక్ట్ ని యువ తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేనితో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'విదా ముయార్చి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమచారం. తమిళ వెర్షన్‌తో పాటు, తెలుగు, కన్నడ మరియు మలయాళ వెర్షన్లు కూడా థియేటర్ రన్ తర్వాత OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రీమియర్ చేయబడతాయి అని సమాచారం.
ఈ సినిమాలో అజిత్ కి జోడిగా తమిళ స్టార్ నటి త్రిష జోడిగా కనిపిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో రెజీనా కసాండ్రా, అర్జున్ సర్జా మరియు ఆరవ్ కూడా ఒక కీలక అపాత్రలో కనిపించనున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బిగ్గీలో హిందీ నటుడు సంజయ్ దత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. కోలీవుడ్ హిట్ మెషిన్ అనిరుధ్ రవిచందర్ ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్కు సంగీతం అందిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.