శతాబ్దాలుగా హిందువులంతా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభానికి మరో మూడు రోజుల సమయమే ఉంది. దేశంలో ఏ ఒక్కరిని కదిలించినా ఇప్పుడు ఈ విషయమే ప్రధాన వార్త. ఏ టీవీ పెట్టినా, రెడియో ఆన్ చేసినా, పేపర్లు చూసినా రామ మందిరానికి సంబంధించిన వార్తే వినిపిస్తున్నది, కనిపిస్తున్నది. అఖరుకు మోబైల్‌లోనూ గ్రూపుల్లో ప్రతి నిమిషానికో న్యూస్ అయోధ్య రామ మందిరానిదే అయి ఉంటుంది. ఆ దేశం నుంచి ఇన్ని కానుకలు వస్తున్నాయ్, ఇక్కడి నుంచి ఇన్ని లడ్డూలు వస్తున్నాయి, వీటి ఖర్చు ఎంతో తెలుసా, అవి ఎక్కడ చేశారో తెలుసా అంటూ ఇబ్బడిముబ్బడిగా వార్తల ప్రవాహం కొనసాగుతుంది. ప్రజలు చూస్తున్నారు ఇతరులకు షేర్ చేస్తున్నారు. తాజాగా ఈ కోవలోనే మరో ఆసక్తికర విషయం నెట్టింట బాగా వైరల్ అవుతున్నది. అదేంటంటే ప్రభాస్ అయోధ్య భోజన ఖర్చుల గురించి. జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామంది హిందువులు ఇప్పటికే అయోధ్యకు పయనమవగా బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట నాటికి భక్తులు లక్షల్లో రానున్నారు. ఈ సందర్బంగా అక్కడికి వచ్చే భక్తుల భోజనాల కోసం సినీ నటుడు ప్రభాస్ రూ.50 కోట్లు విరాళం ఇచ్చాడని, దాదాపు 300కు పైగా ప్రదేశాల్లో ఏర్పాట్లు చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కూడా ఈ మాట ప్రస్తావించడంతో ఈ అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది.