తన పెళ్లిపై క్యూట్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు ముందు నుంచి తల్లిదండ్రుల సపోర్ట్ ఉందని చెప్పారు. ఏదైనా పెళ్లి సీన్లో నటిస్తే అమ్మ ఏడుస్తుందని..అయితే అది నిజం కాదని ఓదారుస్తానన్నారు. తనకు మరో మూడు, నాలుగేళ్ల వరకు పెళ్లి ఆలోచన లేదని తెలిపారు. వర్ష నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ ఫిబ్రవరి 9న విడుదల కానుంది.