జాతి రత్నాలు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ కెవి దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు చిత్ర పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ అనుదీప్ రవితేజకు కామెడీ స్క్రిప్ట్‌ను వినిపించినట్లు సమాచారం. కథ విన్న వెంటనే స్టార్ నటుడు వెంటనే స్క్రిప్ట్ కి ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ప్రస్తుతం రవితేజ ఈగిల్ మరియు హరీష్ శంకర్‌తో ఒక రీమేక్ ప్రాజెక్ట్ ని చేస్తున్నారు. హరీష్ శంకర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే అనుదీప్‌తో సినిమాకి సంబంధించిన పనిని రవితేజ ప్రారంభించనున్నట్లు లేటెస్ట్ టాక్. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో రవితేజకి జోడిగా రుక్మిణీ వసంత్ నటించనున్నట్లు సమాచారం.