మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న మిస్టర్ బచ్చన్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేనితో రవితేజ పనిచేయాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. యువ దర్శకుడు అనుదీప్ కెవితో రవితేజ వర్క్ చేయనున్నాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.
జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్ర కోసం కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌ను మూవీ టీమ్ సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది.