మోహన్‌లాల్ నటించిన లూసిఫర్ మాలీవుడ్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటి. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ డ్రామాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. ఇటీవల, లూసిఫెర్ నిర్మాతలు సీక్వెల్ ని ప్రకటించారు. ఈ సీక్వెల్ కి L2: ఎంపురాన్ (L2E) అని పేరు పెట్టారు. మోహన్ లాల్ నటించనున్న ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ మరోసారి దర్శకత్వం వహించనున్నారు.
తాజాగా ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రం యొక్క UK షెడ్యూల్‌ను ముగించినట్లు వెల్లడించారు. మరో కీలక షెడ్యూల్ కోసం చిత్ర బృందం ఇప్పుడు అమెరికా వెళ్లనుంది. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ ఆశీర్వాద్ సినిమాస్‌తో కలిసి నిర్మిస్తుంది. ఈ చిత్రానికి దేవ్ మ్యూజిక్ కంపోస్ చేస్తున్నారు.