ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని చేయనున్న సంగతి అందరికి తెలిసందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. తాజాగా ఇప్పుడు ఈ స్పోర్ట్స్ డ్రామా మార్చి 2024లో సెట్స్ పైకి వెళ్లనుంది అని ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్.
ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.