స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ అభిమాని కృష్ణ అనే వ్యక్తి నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు అతడికి కీర్తి నుంచి రిప్లై వచ్చింది. సోషల్ మీడియాలో సదరు అభిమాని కీర్తి ఫొటోలను షేర్ చేస్తూ ఆమె రిప్తై కోసం చూస్తున్నాడు. చివరికి 234 రోజుల తర్వాత ఆమె సమాధానం ఇచ్చింది. ‘‘హో. 234! ఫ్యాన్సీ నంబరు. మీరు ఇంతకాలం వెయిట్ చేసినందుకు సారీ. లవ్ యూ’’ అని పేర్కొన్నారు. దీంతో సదరు అభిమాని మరో పోస్ట్ ద్వారా ఆనందం వ్యక్తం చేశాడు.