బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టితో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా కంగనా స్పందించారు. కంగనా మాట్లాడుతూ.. ‘దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి. నిషాంత్‌కు ఆల్రెడీ పెళ్లయింది. ఆయన వైవాహిక జీవితం సంతోషంగా ఉంది. నేను వేరే వ్యక్తితో డేటింగ్లో ఉన్నా. టైం వచ్చినప్పుడు అతనెవరో చెప్తాను. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి.’ అని అన్నారు.