కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తెలుగు చిత్రసీమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో దేవర ఒకటి. ఈ సినిమా 80% షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ మోకాలి మరియు ట్రైసెప్ సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. ఏపీ సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మూవీ టీమ్ ఈ వార్తలను ఖండించినప్పటికీ, సైఫ్ అలీ ఖాన్‌కు తాజా శస్త్రచికిత్స ఆ పుకార్లను మరింత ప్రభావితం చేసింది.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, తారక్ పొన్నప్ప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.